స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుదాం

శాంతిపురం బిజెపి అధ్యక్షులు గజేంద్ర కుప్పం,జులై 23 (గరుడ ధాత్రి న్యూస్): రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుదామని శాంతిపురం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గజేంద్ర విజ్ఞప్తి చేశారు. గురువారం శాంతిపురం మండలం కేంద్రంలో మండల స్థాయి భారతీయ జనతా పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో స్థానిక ఎన్నికలలో పోటీ చేయుటకు చర్చ జరిగింది. గ్రామీణ స్థాయి నుంచి బిజెపిని బలోపేతానికి కృషి చేయుటకు నిర్ణయించడం జరిగింది.అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి అరాచక కార్యకలాపాలను ఖండించడం జరిగింది....