GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:19 am Posted by : GURU SWAMY

సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయండి

-ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పం,జులై 23 (గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం కోరారు.గురువారం కుప్పం మండలం వసనాడు గ్రామంలో పంచాయతీ సమన్వయ కమిటీ సమావేశంలో జరిగింది. సమావేశంలో నారా భువనేశ్వరి రానున్న పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించడం జరిగింది. పర్యటన విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించడం జరిగింది.