GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:00 pm Digital Edition : GURU SWAMY

విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యం

* ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ సాహిత్య రఘు.
* కుప్పం డిగ్రీ కళాశాలలో స్ట్రెస్ మేనేజ్మెంట్ పై అవగాహన సదస్సు.
* పాల్గొన్న వైస్ చైర్మన్ సాగర్ రాజ్.
కుప్పం,జులై 25 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని కుప్పం డిగ్రీ కళాశాలలో శనివారం స్ట్రెస్ మేనేజ్మెంట్ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ సాహిత్య రఘు, ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మీ అవగాహన కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, ఒత్తిడి కలిగించే ప్రధాన కారణాలు,వాటిని గుర్తించే పద్ధతులు, ఒత్తిడి సమర్థవంతంగా నియంత్రించే మార్గాలు, సానుకూల ఆలోచన విధానం,సమయ నిర్వహణ,భావోద్వేగ నియంత్రణ, ఏకగ్రత పెంపొందించుకోవడం, పరీక్షల సమయంలో ఆందోళనను తగ్గించుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అదనంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగ ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన నిద్ర సమతుల్య ఆహారం, మొబైల్ ఫోన్ వినియోగం నియంత్రించడం వంటి అంశాలపై కూడా విద్యార్థులకు ఉపయోగకరమైన సూచనలు అందించారు. విద్యార్థులు తమ రోజువారి జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రేరణాత్మక సందేశాలు అందించడంతోపాటు, సందేహాలకు సమాధానాలు ఇచ్చే ప్రశ్నోత్తర కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, మానసిక దృఢత్వం, నాయకత్వ లక్షణాల పెంపొందింపు, విద్యాప్రగతి, జీవిత నైపుణ్యాలు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని కళాశాల వైస్ చైర్మన్ సాగర్ రాజ్ తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డి. సుధారాణి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉందని, విద్యతో పాటు మానసిక దృఢత్వం కూడా విజయానికి కీలకమని తెలుపుతూ కళాశాలలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు తరచు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అన్ని విభాగాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు