GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 8:26 pm Posted by : GURU SWAMY

చిన్నారి దర్శిణి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సందడి

తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని మదనంజేరి గ్రామంలో చిన్నారి దర్శిణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరై చిన్నారి దర్శిణికి శుభాశీస్సులు అందించారు.
ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి దర్శిణి ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.