మైదుకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఘన నివాళి
గరుడ ధాత్రి న్యూస్ జులై 21 మైదుకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పందిటి నడిపి సుబ్బరాయుడు మరియు ఓబులమ్మ దంపతులు ఇటీవల జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం ఎంతో బాధాకరం. ఈ నేపథ్యంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వారి నివాసానికి వెళ్లి దివంగత దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు...