GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 8:10 am Digital Edition : GURU SWAMY

నాగలాపురం మండల ప్రజలకు ఋణపడి ఉంటా…! -ఎమ్మెల్యే ఆదిమూలం

నాగలాపురం, జూలై 26 గరుడధాత్రి : సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం పట్టణంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పండ్ల తోటల పెంపకంపై అవగాహన సదస్సుకు విచ్చేసిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి, జనసందోహం మధ్య టిఆర్ఆర్ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీగా తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలందరినీ ఒకే వేదికపై నడిపిస్తూ ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యమన్నారు.
తనపై ఎల్లప్పుడూ ప్రేమా అభిమానాలు చూపుతూ, తన వెన్నంటి ఉన్న నాగలాపురం మండల ప్రజలకు ఋణపడి ఉంటానని చెప్పారు.
జెడ్పీటీసీ సుమన్ కుమార్ కూడా ఎమ్మెల్యేతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయడం, నాయకులు-కార్యకర్తలకు అవసరమైన సహకారం అందించడం, ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంపొందించడం కోసం సమిష్టిగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలు, కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరవుతుండటంతో కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అక్కాచెల్లెమ్మలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఐటీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు పత్తిపాటి యాచేంద్ర నాయుడు,రామాంజులు నాయుడు, గోపి రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, లోకయ్య రెడ్డి, ఈశ్వరయ్య, నరేంద్ర,బాలరాజు , పృద్విరాజ్, రాజ మాణిఖ్యం శెట్టి, సెల్వకుమార్, భాస్కర్ శెట్టి, ప్రసాద్ రాజు, ఎస్.ఎం. సురేష్, షణ్ముగ ఆచారి, పరశురామ్ శిల్పి, చంద్రశేఖర్ రాజు, జ్యోతి చెట్టి, ప్రభాకర్,మాజీ యంపిటీసి మురళి, మాజీ వైస్ యంపిపి అన్బు, చంద్రబాబు, శేఖర్, శ్రీరాములరెడ్డి, మాజీ ఎంపీటీసీ బాబు, బాబు మొదలియార్, టీపీకోట మనోహర్, మురళి, మహేష్, రవిశెట్టి, కడివేడు మహేష్, మణి, లక్ష్మణ్, జనార్దన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.