నాగలాపురం మండల ప్రజలకు ఋణపడి ఉంటా…! -ఎమ్మెల్యే ఆదిమూలం

నాగలాపురం, జూలై 26 గరుడధాత్రి : సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం పట్టణంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పండ్ల తోటల పెంపకంపై అవగాహన సదస్సుకు విచ్చేసిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి, జనసందోహం మధ్య టిఆర్ఆర్ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి సమన్వయంతో...