విలేకరుల సమావేశంలో టిడిపి నాయకుల వెల్లడి.
కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈనెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం పర్యటన వివరాలను విలేకరులకు వివరించారు.నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన ఉంటుందన్నారు.
ఈ నెల 27 న 9 గం.లకు శివపురం వద్దనున్న నివాసంలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారన్నారు. రామకుప్పం మండలంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారన్నారు.ఈ నెల 28 న కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభిస్తారని తెలిపారు.
ద్రావిడ వర్సిటీలో విద్యార్థులకు నిర్వహించే క్విజ్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 29 న కుప్పం మండలంలో నారా భువనేశ్వరి పర్యటన ఉంటుందన్నారు.
హార్టికల్చర్ హబ్ ను సందర్శించనున్నారని,
గరిగెచినేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశంలో పాల్గొంటారు.
30 న కుప్పంలో పలు ఆలయాలను సందర్శిస్తారని తెలిపారు.టీటీడీ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాజగోపాల్, ప్రతాప్ కుమార్, డాక్టర్ వి. వెంకటేష్, జెని, ఉదయ్ కుమార్, సెల్వ రాజు, సోమశేఖర్ పలువురు నాయకులు పాల్గొన్నారు.