27 నుంచి 30 వరకు కుప్పం సెగ్మెంట్లో లో నారా భువనేశ్వరి పర్యటన

విలేకరుల సమావేశంలో టిడిపి నాయకుల వెల్లడి. కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈనెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం పర్యటన వివరాలను విలేకరులకు వివరించారు.నాలుగు రోజులపాటు...