ఆర్‌కేఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లో ఎన్సిసి ఎంపిక
కార్వేటినగరం. జూలై 22 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరంలో ఉన్న ఆర్‌కేఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కార్వేటినగరంలో 35 ఆంధ్ర బెటాలియన్, చిత్తూరు ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ ఎంపికలో 25 మంది బాలురు మరియు బాలికలు ఎన్‌సీసీ క్యాడెట్లుగా ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు నాయకత్వం (Leadership), ఆయుధాలపై ప్రాథమిక శిక్షణ (Weapon Training), డ్రిల్, ఆరోగ్యం మరియు పరిశుభ్రత (Health & Hygiene), క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం వంటి అంశాలలో శిక్షణ అందించబడుతుంది....