GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 7:26 pm Digital Edition : GURU SWAMY

నూతన డీఎంహెచ్ఓ డాక్టర్ పి. యుగందర్ ను సన్మానించిన నక్కలదిన్నె పీహెచ్‌సీ వైద్య బృందం…

గరుడ దాత్రి న్యూస్ మైదుకూరు జులై 20
కడప జిల్లా నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిగా (DMHO) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి. యుగంధర్ ,ఎంబీబీఎస్, ఎంఎస్ (ఆర్థో) గారిని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్యులు, సిబ్బంది మరియు వైద్య బృందం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా కడప వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
గతంలో మచిలీపట్నం జిల్లా డీఎంహెచ్ఓగా సమర్థవంతంగా సేవలందించిన డాక్టర్ యుగందర్ ఇటీవల కడప జిల్లాకు బదిలీపై వచ్చి నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియాజేశారు .
ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ, డాక్టర్ పి. యుగందర్ నాయకత్వంలో కడప జిల్లాలో ప్రజారోగ్య సేవలు మరింత బలోపేతం కావాలని, ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ఆయన విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. ఓబులేసు, ఆరోగ్య విస్తరణ అధికారి యం.రాఘవయ్య, డిప్యూటి హెచ్ ఈ ఓ జయ ప్రకాశ్, సూపర్ వైజర్ ప్రసాద్, పాటు పీహెచ్‌సీ వైద్య, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.