గ్రీవెన్స్‌కు అధికారుల జంప్: సూళ్లూరుపేటలో నీరుగారుతున్న ‘ప్రజా వేదిక

*11:45 దాటినా కార్యాలయానికి రాని సిబ్బంది, అధికారులు.. గంటల తరబడి బాధితుల నిరీక్షణ* *ప్రభుత్వ ఆదేశాలకే తూట్లు పొడుస్తున్న నిర్లక్ష్యం.. ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్* *సూళ్లూరుపేట, (కాకతీయ ప్రతినిధి) జూలై 20* ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి అక్కడికక్కడే సత్వర పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సూళ్లూరుపేట మండల స్థాయి అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారుల అలసత్వం మరియు బాధ్యతారాహిత్యంతో సోమవారం నాటి కార్యక్రమం పూర్తిగా ప్రశ్నార్థకంగా...