GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 6:55 pm Posted by : GURU SWAMY

బైరెడ్డిపల్లి పెద్ద చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన అధికారులు, కిషోర్ గౌడు

జేసీబీ ట్రాక్టర్ మరియు గృహ యజమానులు వారి వృథా వ్యర్థాలను చెరువు దగ్గర తొలివేస్తే జరిమానా,కఠినచర్యలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూలై 20
బైరెడ్డిపల్లి పెద్ద చెరువు సుందరీకరణ పనులను అధికారులు, కిషోర్ గౌడు సోమవారం పరిశీలించారు.దాదాపు 13 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం హంద్రీ-నీవా ద్వారా విడుదల చేసిన నీటితో బైరెడ్డిపల్లి పెద్ద చెరువు నిండిన నేపథ్యంలో పలమనేరు శాసన సభ్యులు అమర్నాథరెడ్డి చొరవతో సుందరీకరణ పనులు చేపడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో చెరువు కట్ట పైన ప్రజలకు నడకకు ఉపయుక్తంగా వాకింగ్ ట్రాక్, బెంచీలు, సోలార్ లైట్లు, స్వాగత ఆర్చి ఏర్పాటు చేయడమే కాకుండా చెరువు ప్రక్కన ఆనుకొని ఉన్న స్థలంలో పిల్లలకు, పెద్దలకు ఉపయోగకరంగా పార్క్ ఏర్పాటు చేసి ఆటల మరియు వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసే విధంగా పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పనులను వి.బి.జి.రామ్ జీ ఏపిడి ఎస్. మల్లిఖార్జున, బైరెడ్డిపల్లి ఎంపీడీఓ ఆనందబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిషోర్ గౌడ్, వి.బి.జి.రామ్ జీ అధికారులు హరినాథ్, రఘునాథ్, వర్మ తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పనులను నాణ్యతా ప్రమాణాలతో, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అదేవిధంగా జేసీబీ ట్రాక్టర్ మరియు గృహ యజమానులు వారి వృథా వ్యర్థాలను చెరువు దగ్గర తొలివేయడం నిషేధించడం జరిగిందని అట్లు ఎవరైనా చేసిన యెడల జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.