GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:51 pm Posted by : GURU SWAMY

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే

కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు

కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్):

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులేనని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, కుప్పం పురపాలక సంఘం పరిధిలోని కుప్పం, దలవాయి కొత్తపల్లి పాఠశాలల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తారని అన్నారు. ఇళ్ల వద్ద తమ పిల్లల విద్య పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు కూడా కలలు కనాలని ఆ కలలను నిజం చేసుకొనేందుకు క్రమశిక్షణ పట్టుదలతో చదువులు కొనసాగించాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.