సత్యవేడు నియోజకవర్గంలో ఆర్టీసీ సేవలు మెరుగుపరచాలి -ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
తిరుపతి, జూలై 20 గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఏపీఎస్ ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత ఉపయోగకరంగా నిర్వహించాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. సోమవారం తిరుపతిలోని ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో రీజినల్ మేనేజర్ జగదీష్ కు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు కీలక డిమాండ్లను ఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. సత్యవేడు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను విస్తరించాలని, నాగలాపురం ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునీకరించి అవసరమైన పునర్నిర్మాణ పనులు చేపట్టాలని...