GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 4:15 pm Posted by : GURU SWAMY

SC, ST కాలనీల్లో విద్యుత్ బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్

​* రూ.2.10 కోట్ల బకాయిల వసూలే లక్ష్యం
​* 29న ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన
​* చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ల తొలగింపు: సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ ప్రకటన

గడుర దాత్రి న్యూస్ ​మైదుకూరు, జూలై 26:
మైదుకూరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని SC, ST కాలనీల్లో దీర్ఘకాలంగా బకాయిపడ్డ విద్యుత్ బిల్లుల వసూలు కోసం రేపటి జూలై 27నుంచి ఈ నెల చివరి వరకు ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తున్నట్లు సబ్ డివిజనల్ అధికారి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
​మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు మరియు వనిపెంట సెక్షన్లలో ఉన్న SC, ST వినియోగదారుల నుంచి మొత్తం రూ. 2 కోట్ల 10 లక్షలు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
​మండలాల వారీగా బకాయిలు:
​ఖాజీపేట మండలం: రూ. 60 లక్షలు
​చాపాడు మండలం: రూ. 50 లక్షలు
​దువ్వూరు మండలం: రూ. 50 లక్షలు
​మైదుకూరు మండలం: రూ. 50 లక్షలు
​29న సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్:
​ముఖ్యంగా జూలై 29 బుధవారం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది నందరినీ రెండు ప్రత్యేక గ్రూపులుగా విభజించి, ఎక్కువ బకాయిలు ఉన్న కాలనీల్లో నేరుగా వసూలు కార్యక్రమం చేపడతారని వెల్లడించారు.