శాస్త్రోక్తంగా శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

22న ధ్వజారోహణంతో వైభవంగా బ్రహ్మోత్సవాల ఆరంభం గరుడ దాత్రి న్యూస్ జూలై21 కడప జిల్లా నందలూరులోని ప్రాచీన, ప్రసిద్ధి గాంచిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా మేదినీపూజ, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేదప్రబంధ శాత్తుమొర జరగగా, ఆపై సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణను ఆగమోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. జూలై 22న ధ్వజారోహణం బుధవారం...