GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 6:59 am Posted by : GURU SWAMY

ఐటిఐ లో ప్రవేశానికి రెండో విడత దరఖాస్తులు ఆహ్వానం

కార్వేటినగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం లో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న సీట్లు కొరకు రెండో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ ఆనంద్ ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు మూడో తేదీ లోపు కార్వేటి నగర ఐటీఐ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఆగస్ట 6 తేదీన ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9533280294 సంప్రదించాలన్నారు