స్వార్థం లేని సేవయే నిజమైన జాతీయవాదం : సంవేదన సేవా ట్రస్ట్ శ్రేయోభిలాషుల సమావేశంలో వక్తలు

పలమనేరు, ఆగస్టు 09 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పట్టణంలోని పవిత్ర శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో "సంవేదన సేవా ట్రస్ట్" ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రేయోభిలాషుల సమావేశం నిర్వహించారు. సమాజ శ్రేయస్సు, జాతీయవాద కార్యకర్తల కుటుంబాల సంక్షేమం మరియు సేవా విస్తరణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన ఉపన్యాసకులుగా సంవేదన సేవా ట్రస్ట్ ప్రాంత అధ్యక్షులు శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. జాతీయవాద సంస్థలలో తమ అమూల్యమైన జీవితాలను, సమయాన్ని దేశం కోసం కేటాయించిన కార్యకర్తల...