పిచ్చాటూరు మండల విద్యార్ధులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్

తిరుపతి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో "షైనింగ్ స్టార్స్ 2026 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం" సోమవారం (20-07-2026) తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు మండలానికి చెందిన పదవతరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన ఆరుగురు (సాయిరాం విద్యాలయం..5, జేబిఆర్..1) విద్యార్థులు గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి మరియు గౌరవ తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, గౌరవ తిరుపతి జిల్లా డీఈఓ కెవిఎన్ కుమార్ చేతులమీదుగా ఒక్కొక్కరు రూ.20,000 నగదు పురస్కారం అందుకుని మండలానికి విశిష్ట...