శక్తిపీఠంలో వైభవంగా శ్వేత వారాహీ నవరాత్రి మహోత్సవాలు…

ఏడో రోజు విశేష పూజలు, రక్త పంచమి వారాహీ మంత్ర హోమం.. 25 వేల మందికి పైగా భక్తుల దర్శనం.. తిరుపతి: ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక శ్రీ పాతాళ శ్వేత వారాహీ మహాక్షేత్రం అయిన రామచంద్రపురం మండలం రాయలచెరువు కట్టపై వెలసిన శ్రీ శక్తిపీఠంలో జరుగుతున్న శ్రీ శ్వేత వారాహీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. మహోత్సవాల ఏడవ రోజున శ్రీ వారాహీ అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష అర్చనలు, మహా మంగళహారతి వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ...