వేణుగోపాల స్వామి గుడిలో తొలి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు

చౌడేపల్లి జూలై 25 గరుడ దాత్రి న్యూస్ మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామములో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు వశిష్టాచార్యులు ఆధ్వర్యంలో ఉదయాన్నే స్వామికి అభిషేకము ,అలంకరణ గావించారు, చౌడేపల్లి ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు