గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
శాస్త్రోక్తంగా ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 20న వైభవంగా పార్వేట ఉత్సవం గరుడధాత్రి న్యూస్ : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున రాత్రి గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయహస్తంతో దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం...