అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాపై ఎస్సై రాఘవేంద్ర హెచ్చరిక

-ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు కౌన్సిలింగ్ పిచ్చాటూరు, జూలై 21 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలంలో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు హెచ్చరిక జారీ చేశారు. స్థానిక ఐసీసీ గ్రౌండ్‌లో మండలంలోని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను వారి వాహనాలతో సహా పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్, రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని...