GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 9:57 pm Posted by : GURU SWAMY

రాష్ట్ర కేబినెట్‌లో ‘నేతన్న నేస్తం’ పథకానికి ఆమోదం

చేనేత కార్మికుల సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయం

మంత్రి సత్యకుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ‘నేతన్న నేస్తం’ పథకానికి ఆమోదం లభించడం పట్ల ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
చేనేత కార్మికుల సంక్షేమం,వారి కుటుంబాల ఆర్థిక భద్రత,సంప్రదాయ చేనేత రంగ పునరుద్ధరణకు ఈ పథకం కీలకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్ర కేబినెట్ ఆమోదం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నేతన్న కుటుంబాలకు, ముఖ్యంగా ధర్మవరం చేనేత కార్మికులకు శుభవార్తగా నిలిచిందన్నారు.
ధర్మవరం చేనేతకు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు నేతన్నల జీవితాల్లో ఆర్థిక భరోసా, సామాజిక భద్రత,అభివృద్ధికి కొత్త అవకాశాలు ఈ పథకం ద్వారా కలుగుతాయని మంత్రి వివరించారు.
చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఈ పథకానికి ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత మంత్రి సవితమ్మకు మంత్రి సత్యకుమార్ యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“నేతన్న సంక్షేమమే మా లక్ష్యం… చేనేత అభివృద్ధియే మా సంకల్పం” అని మంత్రి స్పష్టం చేశారు.