నిషేధిత గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తే కఠిన చర్యలు
పలమనేరు, జులై 21 ( గరుడ ధాత్రి ) : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలమనేరు పట్టణంలో అక్రమ గుట్కా, పాన్ మసాలా వ్యాపారాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలమనేరు అర్బన్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు లోకేష్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం పట్టణంలోని పలు షాపులు, కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కొన్ని దుకాణాల్లో అక్రమంగా గుట్కా, పాన్ పరాగ్, హాన్స్, కూల్‌లిప్ వంటి నిషేధించబడిన పదార్థాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ సోదాలు...