GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:53 am Digital Edition : GURU SWAMY

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఐరాల జులై 24 (గరుడ దాత్రి న్యూస్)

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఐరాల మండలం మాజీ టీడీపీ అధ్యక్షులు బత్తల సురేందర్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఐరాల మండలం పొలకల గ్రామ పంచాయతీ కేంద్రంలోని పొలకల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్ల ప్రసాద్ రావు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ సూచనల మేరకు ప్రధానోపాధ్యాయులు లత ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్.టీచర్స్ (పీటీమ్. 4.0) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని పేర్కొనడం జరిగినది.ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ సుజాత వైస్ చైర్మన్ భాస్కర్ ఉపాధ్యాయులు వేణుగోపాల్, రామకిష్ణ, భువనేశ్వరి, లలిత కుమారి,వాణి,రోజా రాణి,హేమకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కు ఆటల పోటీలు నిర్వహించి వారికీ బహుమతులు అందజేయడం జరిగినది. అనంతరం పేరెంట్స్,టీచర్స్ విద్యార్థులతో కలసి భోజనం చేశారు.