GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 6:42 am Digital Edition : GURU SWAMY

స్కంద పుష్కరిణిలో సుబ్రమణ్య స్వామి విహారం

కార్వేటినగరం ఆగస్టు 8 ( గరుడాదాద్రి న్యూస్)
శ్రీ వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి స్కంద పుష్కరిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్వేటి నగరం కుమారగిరిపై వెలసిన వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృతిగా పూజల్లో భాగంగా శనివారం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఉదయం ఆలయంలో స్వామి అమ్మలకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయ దాతలుగా చింత తోపు గిరిజన కాలనీ వారు స్వామివారికి వరుస సమర్పించారు. తిరుచ్చి వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి వేద పండితులు మంత్రోచ్ఛారణ అంగరంగ వైభవంగా తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఊరేగింపు అనంతరం స్వామి అమ్మ వాళ్లు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాంశెట్టి రాజశేఖర్, ఈవో కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు వినయ్, ఎర్రగోటి రాధాకృష్ణ, గోవిందస్వామి, హరికుమార్ అమరావతి తులసి సెల్వి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తదితరులు పాల్గొన్నారు.