స్కంద పుష్కరిణిలో సుబ్రమణ్య స్వామి విహారం

కార్వేటినగరం ఆగస్టు 8 ( గరుడాదాద్రి న్యూస్) శ్రీ వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి స్కంద పుష్కరిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్వేటి నగరం కుమారగిరిపై వెలసిన వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృతిగా పూజల్లో భాగంగా శనివారం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఉదయం ఆలయంలో స్వామి అమ్మలకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయ దాతలుగా చింత తోపు...