విజయవంతంగా ముగిసిన రెండు రోజుల ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్
అనంతపురం గరుడధాత్రి న్యూస్ : జేసిఐ అలుమ్నీ క్లబ్ ఇండియా జోన్-26 ఆధ్వర్యంలో అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన రెండు రోజుల "ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్" విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమానికి అన్ని వసతులు కల్పించిన ఆర్డిటి డైరెక్టర్ కె.ఎం. మహమ్మద్ రఫీకి జేసిఐ అలుమ్నీ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న సభ్యులకు వేదికపై ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలు, సమర్థవంతమైన కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, ప్రెజెంటేషన్ స్కిల్స్, నాయకత్వ...