GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 5:34 pm Digital Edition : GURU SWAMY

ప్రభుత్వ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
* టిడిపి నేతల శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు.
* కార్యకర్తల్లో నాయకత్వ పటిమ పెంపుకోసమే శిక్షణ తరగతులు.
కుప్పం,ఆగస్టు 08 (గరుడ ధాత్రి న్యూస్):కార్యకర్తల్లో నాయకత్వ పటిమను పెంపొందించేందుకే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం అమరావతి లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం లో కార్యకర్తల సత్యనారాయణ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇంఛార్జ్ శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మనం చేసిన సత్ఫలితాలను చెప్పుకోకపోతే ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలనే ప్రజలు నమ్మే ప్రమాదం ఉందన్నారు. డీఎస్సీ నిర్వహణపై పారదర్శకంగా వ్యవహరించడం వల్లే ప్రతిపక్షాల కుట్రలు తిప్పికొట్టగలిగామని, కర్నూలులో టీచర్లే వైకాపాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్తే కుట్రలను ప్రజలే చేధిస్తారన్నారు.