గ్రామాల్లో తహసీల్దార్ రాజేంద్ర విస్తృత పర్యటన: క్షేత్రస్థాయిలో సచివాలయాల తనిఖీ
! ‘వన్‌మంత్-వన్‌విలేజ్-ఫోర్‌విజిట్స్’ లో భాగంగా ముచ్చలగుంటలో కార్యక్రమాలు.. తల్లంపాడులో ఎలక్షన్ విధుల పరిశీలన! పాలన పారదర్శకంగా ఉండాలి.. సచివాలయ సిబ్బందికి తహసీల్దార్ ఆదేశం దొరవారిసత్రం, జూలై 23 (గరుడ దాత్రి): మండలంలో పాలనను మరింత వేగవంతం చేస్తూ, ప్రజలకు సేవలను వేగంగా అందించడమే లక్ష్యంగా దొరవారిసత్రం మండల తహసీల్దార్ రాజేంద్ర పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. మండల పరిధిలోని ముచ్చలగుంట, పోలిరెడ్డిపాలెం, తల్లంపాడు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పలు శాఖల పనితీరును, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముచ్చలగుంటలో ‘వన్‌మంత్-వన్‌విలేజ్-ఫోర్‌విజిట్స్’: ప్రభుత్వ ఆదేశాల...