కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్ రాజేంద్ర
బియ్యం, మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలన.. డిజిటల్ బోధనపై ఆరా విద్యార్థినులకు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించాలి: అధికారులకు స్పష్టం దొరవారిసత్రం, జూలై 23 గరుడ ధాత్రి: దొరవారిసత్రం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కేజీబీవీ గురువారం మండల తహసీల్దార్ రాజేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు మరియు ఆహార నాణ్యతను ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. -బియ్యం నాణ్యత, స్టాక్ తనిఖీ తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించిన తహసీల్దార్ రాజేంద్ర,...