కార్వేటి నగరం జూలై 20 గరుడ దాద్రి న్యూస్
కార్వేటినగరం లో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజు ల స్వామి ఆలయంలో మహాభారత ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద శ్రీమతి సుమతి ఆధ్వర్యంలో బకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పుష్కరిణి నుండి తీర్థం తీసుకుని స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. రాత్రి అమ్మవారు ప్రత్యేక అలంకరణతో పురవీధుల్లో ఊరేగించారు. రాత్రి వెంకటేశ్వర నాట్య కళామండలి ఆధ్వర్యంలోనాటకం నిర్వహించారు. ఉభయ దాతలుగా విశ్వబ్రాహ్మణ కులస్తులు రాజగోపాల్ ఆచారి, నాగరాజు ఆచారి, రమేష్ ఆచారి, జగదీష్ ఆచారి ,నిర్వహించారు. ఆలయం చుట్టూ మరియు గ్రామం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, ఉపాధ్యక్షులు రవి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, కోశాధికారి లక్ష్మీపతి మొదలియార్, సహాయ కార్యదర్శి సాయి రాయల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు.