ఆ వృక్షమే..ఆమెకు ఆశ్రయం…

మానవత్వం కోసం ఎదురుచూస్తున్న ఓ అభాగ్యురాలు.. రామచంద్రపురం గరుడధాత్రి : ఎక్కడి నుంచి వచ్చిందో... ఎవరు ఆమె కుటుంబ సభ్యులో... ఏ పరిస్థితుల్లో ఇక్కడికి చేరుకుందో ఎవరికీ తెలియదు. కానీ రామచంద్రపురం మండలం ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని ఓ పెద్ద చెట్టు కిందే ఆమె జీవితం సాగుతోంది. అదే చెట్టు ఆమెకు ఇల్లు, అదే నీడ ఆమెకు ఆశ్రయం. ఆకలి వేస్తే ఎవరైనా దయతో ఇచ్చిన ఆహారమే ఆమెకు భోజనం. ఎవరూ ఇవ్వకపోతే పస్తులతోనే రోజును గడుపుతోంది. అయినప్పటికీ, అక్కడే ఉన్న నాగాలమ్మ ఆలయ...