రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం : మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న
పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) : రైతులు తమ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పొందేలా చర్యలు తీసుకోవడమే మార్కెట్ కమిటీ లక్ష్యమని పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న తెలిపారు. సోమవారం పలమనేరు మార్కెట్ యార్డులోని టమోటా మండీల వద్ద జరుగుతున్న వేలం ప్రక్రియను మార్కెట్ కార్యదర్శి సంజీవ్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ, రైతులు తీసుకొచ్చే పంటలకు నాణ్యత ఆధారంగా గిట్టుబాటు ధరలు లభించేలా నిరంతరం కృషి చేస్తామని చెప్పారు....