బద్వేలు వృద్ధ దంపతుల ఘటనలో మహిళ రవిక చింపినట్లు సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం-మైదుకూరు డి.ఎస్.పి రాజేంద్ర ప్రసాద్

గరుడ దాద్రి న్యూస్ మైదుకూరు జులై 20: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మార్తోమా నగర్‌లో ఉన్న 3 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి బద్వేలుకు చెందిన పిన్నం వెంకటయ్య మరియు ప్రొద్దుటూరుకు చెందిన అయ్యవారమ్మ తదితరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో, 18.07.2026 తేదీ సాయంత్రం పిన్నం వెంకటయ్యకు మరియు సదరు స్థలాన్ని అయ్యవారమ్మ వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పబడుతున్న కడపకు చెందిన బొజ్జా తిరుమలేష్ తదితరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే...