ద్రౌపది మాత కళ్యాణం కమనీయం,కడు రమణీయం
అమ్మవారి కల్యాణాన్ని తిలకించడానికి కదలి వచ్చిన భక్త జనసంద్రం వేదమంత్రాలతో సాంప్రదాయ బద్ధంగా సాగిన కళ్యాణ తంతు ఆలయానికి పోటెత్తిన విరాళాలు రామచంద్రాపురం, జూలై 20 గరుడధాత్రి : రామచంద్రాపురం మండలంలో నిలువు రాళ్ల కమ్మపల్లి గ్రామంలో వెలసివున్న శ్రీకృష్ణ పాండవుల సమేత ధర్మరాజుల ఆలయంలో 60వ మహాభారత వార్షికోత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం ఆది గర్భేశ్వరి శ్రీ ద్రౌపతి మాత కళ్యాణం మంగళ వాయిద్యాల మధ్య కమనీయంగా,కడు రమణీయంగా సాగింది. వేదమంత్రాలతో పౌరోహితులు మాడభూషిత రాజగోపాల్ అయ్యంగార్ ,ప్రదీప్ అయ్యంగార్ల బృందం...