80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ఆగస్టు 8 గరుడధాత్రి : జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, క్రమబద్ధంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఇతర...