టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు.
జిల్లా టిడిపి అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, కుప్పం ఇంచార్జ్ మునిరత్నం.
కుప్పం,జులై 22 (గరుడ ధాత్రి న్యూస్):
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన కుప్పం బైపాస్ రోడ్డు లోని ఎన్టీఆర్ భవన్లో నియోజకవర్గస్థాయి టీడీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి టిడిపి నేతలు పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్. మునిరత్నం లు పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పార్టీ యంత్రాంగం కార్యాలయం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్, కుప్పం అర్బన్, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నామినేటెడ్ పదవుల్లోని వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.