బైరెడ్డిపల్లి లో కొనసాగిన ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై20 ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం వైద్యాధికారి విజయ్ చంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ జబ్బు స్క్రీనింగ్ కొరకు హ్యాండిల్ ఎక్స్రేలు తీయడం జరిగినది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, పొగ త్రాగేవారికి మద్యం తాగే వారికి, BMI 18 కంటే తక్కువ ఉన్నవారికి, ఇతర క్రానిక్ జబ్బులు ఉన్నవారికి, హెచ్ఐవి, ఎయిడ్స్ ఉన్నవారికి మొదలగు వారికి 85 మందికి ఎక్స్రే X-ray తీశారు. క్షయ వ్యాధిని ప్రారంభ దశ లో...