అలరించిన దుర్యోధన వధ

రామచంద్రాపురం: మండలంలోని నూతిగుంటపల్లి శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో గత 11 రోజులుగా జరుగుతున్న మహాభారత ఉత్సవాలు ఆదివారం దుర్యోధన వధ ఘట్టంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా కీలకమైన దుర్యోధన వధ నాటక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. భీమసేనుడిగా బాలాజీరెడ్డి, గంటావారి పల్లె, దుర్యోధనుడిగా బంగారు పాల్యం గోవిందరాజులు , వేషదారులు తమ అద్భుతమైన అభినయంతో హావభావాలతో, తమ గాత్రంతో పద్యాలాపనతో పాత్రలకు ప్రాణం పోశారు.ప్రాణ భయంతో దుర్యోధనుడు గంగమడుగులో దాక్కోవడం, భీముడు తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అతడిని బయటికి రప్పించడం,...