చౌడేపల్లి జూలై 21 గరుడ దాత్రి న్యూస్
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంట నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు వెంటనే పంట బీమా ప్రీమియం చెల్లించాలని పుంగనూరు వ్యవసాయ సంచాలకుడు శివకుమార్ కోరారు. స్థానిక ఆర్ఎస్కే కేంద్రంలో రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం’ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వివిధ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు ఆఖరి తేదీలను, ఎకరా వారీగా ప్రీమియం వివరాలను విడుదల చేశారు.
రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలు కామన్ సర్వీస్ సెంటర్లు బ్యాంకులను సంప్రదించి గడువు ముగిసేలోగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పంటల వారీగా ప్రీమియం వివరాలను ఆయన తెలియజేశారు
వేరుశనగ పంటకు ఎకరాకు బీమా రూ 28,000 రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎకరాకు రూ 560 రూపాయలు టమోటా పంటకు ఎకరాకు బీమా రూ 30 వేల రూపాయలు రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎకరాకు రూ 1500 రూపాయలు; కంది పంటకు ఎకరాకు బీమా రూ 20వేల రూపాయలు రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎకరాకు రూ 400 రూపాయలు; రాగి పంటకు ఎకరా ఎకరాకు బీమా రూ 17వేల రూపాయలు రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎకరాకు రూ 170 రూపాయలు; వరి పంటకు ఎకరాకు బీమా రూ 42000 రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎకరాకు రూ 840లు చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ రైతులు పాల్గొన్నారు