నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
ఢిల్లీలో శాంతియుత నిరసనకారులపై పోలీసుల దాడిని ఖండిస్తూ సిపిఎం-సిపిఐ నిరసన. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ను చర్చలకు కూడా పిలవకుండా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించడం, అనంతరం శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తున్న ఉద్యమకారులపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు తిరుపతిలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం–సిపిఐ ఆధ్వర్యంలో...