శ్రీ శక్తి పీఠంలో‌ వైభవంగా వారాహినవరాత్రులు

రామచంద్రపురం: మండలంలోని శ్రీ శక్తి పీఠంలో‌ వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక శ్రీ పాతాళ శ్వేత వారాహీ మహాక్షేత్రమైన తిరుపతి శ్రీ శక్తిపీఠంలో నిర్వహించబడుతున్న శ్రీ వారాహీ నవరాత్రి మహోత్సవములలో ఆరవ రోజున అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా *భయ నివారణ, రక్షణ, విజయం, భూ/గృహ* సమస్యా పరిష్కారం కొరకు విశేష ఫలదాయకమైన *శ్రీ లఘు వారాహీ దేవి* ప్రత్యేక మంత్ర హోమం నిర్వహించబడినది. స్త్రీమూర్తులకు సువాసిని పూజా, మధ్యాహ్నం అమ్మవారికి...