* కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వికాస్ మర్మత్.
* ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ.
* కుప్పం లో పారిశ్రామిక ప్రగతికి ప్రణాళిక బద్ధంగా కృషి.
* ప్రభుత్వ సేవల పట్ల ప్రజల సంతృప్తి పెంచేందుకు నిరంతరం కృషి.
* కుప్పం సెగ్మెంట్లో పి.ఫోర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ.
* ప్రగతి పనుల నిరంతరం పర్యవేక్షణ.
* స్వచ్ఛ కుప్పం స్వర్ణ కుప్పం గా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు.
* కుప్పంలో టాటా సంజీవిని విజయవంతానికి నిరంతరం పర్యవేక్షణ.
కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్): కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పలాలను అందుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గానికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పట్టాలెక్కింది. కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఈ అథారిటీకి ప్రత్యేక అధికారిని నియమించారు. ముఖ్యంగా ఐఏఎస్ కేడర్ కు చెందిన వికాస్ మర్మత్ ను ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమించారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వికాస్ మర్మత్ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో వేగం పెంచారు. ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు సూచనల మేరకు ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ కుప్పం ప్రగతిలో అన్ని అంశాలలో వేగం పెంచారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి సోమవారం కడా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న సమస్యలను ఓపికగా వింటూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మరో ప్రక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అందే అర్జీల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలు ఉండగా తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. హాస్టళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ విభాగాలను తరచూ సందర్శిస్తూ తగిన సూచనలు అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్న పి ఫోర్ కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో విజయవంతం అయ్యేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. కుప్పంను స్వచ్ఛ కుప్పం స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సలహా మండలి సమావేశాలను నిర్వహిస్తూ ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలను స్వీకరించి ఆ పనులను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కుప్పం నియోజకవర్గాన్ని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా ఇప్పటికే దాదాపు 25 పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి విజయం సాధించారు. ఈ పరిశ్రమలు ఏర్పాటుతో వేలాదిమందికి స్థానికంగానే ఉపాధి లభించనుంది. కుప్పం నుంచి ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లే పరిస్థితి పోయి ఇతర ప్రాంతాల నుంచి కుప్పంకు ఉపాధి కోసం వచ్చే పరిస్థితులు ఏర్పడుతోంది. అంతేకాకుండా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో విమానాశ్రయం ఏర్పాటుకు కూడా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కుప్పంలో టాటా సంజీవిని కార్యక్రమం పై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ కార్యక్రమ విజయానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఐదువేల ఈ సైకిల్ లను ప్రజలకు అందేలా చర్యలు తీసుకొని, గిన్నిస్ రికార్డ్ అందే విధంగా కృషి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తరచూ జాబ్ మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి సలహాలు సూచనల మేరకు కుప్పం సమగ్ర ప్రగతికి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ కృషి చేస్తున్నారు.