విక్రమ్-1 విజయం చారిత్రాత్మకం – డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి
గరుడ దాత్రి న్యూస్ : దేశంలో ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి రాకెట్ విక్రమ్-1 శ్రీహరికోట నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించడం చారిత్రాత్మక విజయమని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్ కుమార్ చందన నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు మరియు మొత్తం బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రైవేట్ రంగం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన...