GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 7:29 pm Posted by : GURU SWAMY

ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పనిచేయాలి

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మునిరత్నం.
కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్): ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ప్రతి ఒక్క శాఖలోని అధికారులు పనిచేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్.మునిరత్నం కోరారు. మంగళవారం కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో కుప్పం మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, శాఖల వారీగా పెండింగ్ అంశాలపై సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే పబ్లిక్ పర్సెప్షన్‌ను మరింత మెరుగుపరిచే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన, అభివృద్ధి విజన్‌కు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగేలా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.