బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్24
బైరెడ్డిపల్లి మండలంలోని రైతులు సొయాబీన్స్ పంట సాగు చేయుటకు ఆసక్తి కల వారు రైతుసేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి గీతకుమారి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ప్రాంతం కు కొత్త అయిన సొయాబీన్స్ పంట ను సాగు చెయ్యడంలో ఆసక్తి కలిగిన రైతులు మండల కేంద్రం లోని బైరెడ్డిపల్లి రైతుసేవా కేంద్రం కు తమ ఆధార్, పట్టాదార్ పాసుబుక్, బ్యాంకు అకౌంట్ జీరాక్స్ కాపీలు తీసుకుని వచ్చి రైతు సేవాకేంద్రం ఇంచార్జి లాగిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత సోయబీన్స్ మరియు అంతరపంట గా కంది ఇవ్వడం జరుగుతుంది అన్నారు.
ఈ అవకాశం ను వర్షధార రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
