ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

కుప్పం,జులై 19 (గరుడ ధాత్రి న్యూస్):
ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల విద్యాభివృద్ధి, వారి సమగ్ర ప్రగతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎస్సీ విద్యార్థులకు భారీగా ప్రవేశాలు దక్కేలా వారిని జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్రంలో మూడు అత్యాధునిక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ఐటీ-విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రత్యేక చొరవతో ఈ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!